Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. తొలిమ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. విజయానికి 229 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో ఆరు వికెట్లు మిగిలి ఉండగానే.. 47 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకొని ట్రోఫీలో మొదటి మ్యాచ్ గెలుచుకుంది. విజయానికి అవసరమైన పరుగుల వేటలో ఒకదశలో వరుసగా వికెట్లు కోల్పోయి భారత్ జట్టు కష్టాల్లో పడ్డట్టు కనిపించింది . ఈ దశలో శుభ్ మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు . అతనికి కేఎల్ రాహుల్ మరోవైపు చక్కని సహకారం అందించాడు . దీంతో బంగ్లాదేశ్ పై టీమిండియా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది .
ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ విజయంతో ప్రారంభించింది. గురువారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 228 పరుగులు చేసింది. భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. ఇది ఐసిసి టోర్నమెంట్‌లో అతని తొలి సెంచరీ. రోహిత్ శర్మ 41, కెఎల్ రాహుల్ 38, విరాట్ కోహ్లీ 22 పరుగులు చేశారు. మహ్మద్ షమీ 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్ నుంచి తౌహీద్ హృదయ్ సెంచరీ సాధించాడు.
Champions Trophy 2025: అంతకు ముందు బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో భారతదేశం తరపున అత్యంత విజయవంతమైన బౌలర్ గా మహ్మద్ షమీ నిలిచాడు. షమీ 10 ఓవర్లలో 53 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. మరోవైపు, బంగ్లాదేశ్ తరఫున తౌహిద్ హృదయ్ ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 118 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అతనితో పాటు, జాకీర్ అలీ కూడా 68 పరుగులు అందించాడు.