Chaganti Koteswara Rao

Chaganti Koteswara Rao: మహావతార్ నరసింహాని మెచ్చిన చాగంటి!

Chaganti Koteswara Rao: హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన ‘మహావతార్ నరసింహా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పౌరాణిక యానిమేషన్‌గా రూపొందిన ఈ సినిమా, అశ్విన్ కుమార్ దర్శకత్వంలో జూలై 25న విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని వీక్షించి, భక్తితో కూడిన అద్భుత అనుభవమని ప్రశంసించారు. క్లైమాక్స్ దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని ఆయన అన్నారు. కుటుంబంతో చూడదగ్గ ఈ సినిమా, సౌత్, నార్త్ ఆడియెన్స్‌ను ఒకేలా ఆకర్షిస్తోంది.

Also Read: Sri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి: మధుర నుంచి అయోధ్య వరకు… భక్తిపారవశ్యం

‘మహావతార్ నరసింహా’ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ చిత్రం, భక్త ప్రహ్లాద కథను యానిమేషన్ రూపంలో అద్భుతంగా ఆవిష్కరించింది. శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా సినిమాను మెచ్చుకున్నారు. నిర్మాత అలు అరవింద్‌తో కలిసి చాగంటి ఈ చిత్రాన్ని వీక్షించి, దాని భావోద్వేగ శక్తిని కొనియాడారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ రివ్యూ, సినిమా క్రేజ్‌ను మరింత పెంచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Diabetes: షుగర్ వ్యాధికి ఈ కొండ పండు దివ్యౌషధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *