Central Govt: కేంద్ర మంత్రివర్గం బుధవారం (నవంబర్ 12) రాజధాని నగరంలో ప్రత్యేక భేటీ కానున్నది. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటనపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నది.
Central Govt: పేలుడు ఘటనపై, తదుపరి తీసుకునేటువంటి చర్యలపై కేంద్ర మంత్రివర్గ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. భద్రతా అంశాలతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. దేశ భద్రత దృష్ట్యా ఆ నిర్ణయాలు కీలకం కానున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. పేలుడు ఘటనలో ఇప్పటి వరకూ 12 మంది వరకు మృత్యువాత పడ్డారు.
Central Govt: భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. పేలుడు ఘటనపై స్పందించారు. పేలుడుకు బాధ్యులైన వారు ఎంతటి వారినైనా వదలబోమని తేల్చి చెప్పారు. అదే విధంగా బాధిత కుటుంబాలకు అన్ని సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తున్నది.

