Central Govt:దేశ ప్రజల వైద్య ఆరోగ్య పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొన్ని వ్యాధులకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన గడువులోపల ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న కొన్ని వ్యాధుల నిర్ధారణతో సరైన చికిత్సలు అందించే వీలుంటుందని భావిస్తున్నది. ప్రాణముప్పును ముందే పసిగట్టి సరైన చికిత్సలు పొందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
Central Govt:30 ఏండ్ల వయసు దాటిన వ్యక్తులు తమ సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నిర్దేశిత వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి ఈ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపింది.
Central Govt:ఈ నెల 20 (ఫిబ్రవరి 20) నుంచి మార్చి 31 వరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. డయాబెటీస్ లక్షణాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన ఎక్స్ వేదికపై వివరించింది. కండ్లు స్పష్టంగా కనిపించకపోవడం, ఆకలి పెరగడం, గాయాలు ఆలస్యంగా మానడం, అలసట, దాహం ఎక్కువగా వేయడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, ఎక్కువగా మూత్రానికి వెళ్తుండటం లాంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది.
Central Govt:దేశంలోని అధిక శాతం ప్రజలను పట్టి పీడిస్తున్న బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకున్నది. దేశంలో 70 శాతం మరణాలు ఆయా వ్యాధుల ప్రభావం వల్లే సంభవిస్తున్నాయని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ ఇటీవలే వెల్లడించింది. 30 ఏండ్లు దాటిన వారిలో ఆయా వ్యాధులు ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఆయా వ్యాధుల నిర్ధారణతో వైద్య చికిత్సలు సకాలంలో పొందతే మరణాల రేటు తగ్గించవచ్చని కేంద్రం భావిస్తున్నది.