Central Govt: జూలై 20న కేంద్రంలో అఖిలపక్ష సమావేశం జరగనున్నది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల దృష్ట్యా జరిగే ఈ సమావేశానికి ఉభయసభల్లోని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. సమావేశాలు సజావుగా నడిచేందుకు విపక్షాలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కోరనున్నది. ఇదే సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం వివరించే అవకాశం ఉన్నది.
