Census 2027:

Census 2027: జ‌నాభా గ‌ణ‌న‌-2027లో స‌ర్వేయ‌ర్లు మీ ఇంటికొచ్చి అడిగే ఆ 33 ప్ర‌శ్న‌లు ఇవే..

Census 2027:దేశ‌వ్యాప్తంగా 2027 జ‌నాభా గ‌ణ‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వం తొలి విడ‌త‌ కీల‌క నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో దేశ‌వ్యాప‌త్ంగా జ‌నాభా లెక్క‌ల సంద‌డి నెల‌కొన్న‌ది. దేశ ప్ర‌జ‌లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నీ గ‌ణ‌నపై స‌ర్వేయ‌ర్ల‌కు 33 ప్ర‌శ్న‌ల జాబితాను కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేసింది. ఆయా వివ‌రాల‌ను ప్ర‌తి ఇంటి నుంచి రాబ‌ట్టాల‌ని సూచించింది. డిజిటల్ ప‌ద్ధ‌తిలో ఆ వివ‌రాల‌ను సేక‌రించ‌నున్నారు. 33 వివ‌రాలు ఏమిటి అనేది కింది విధంగా ఉన్నాయి.

1) భ‌వ‌నం నంబ‌ర్ (మున్సిప‌ల్ లేదా స్థానిక సంస్థ లేదా జ‌నాభా గ‌ణ‌న నంబ‌ర్‌)
2) జ‌నాభా గ‌ణ‌న ఇంటి నంబ‌ర్‌
3) ఇంటి నేల త‌యారీకి ఉప‌యోగించిన ప్ర‌ధాన ప‌దార్థం
4) ఇంటి గోడ‌ల త‌యారీకి ఉప‌యోగించిన ప్ర‌ధాన ప‌దార్థం
5) ఇంటి పైక‌ప్పు త‌యారీకి ఉప‌యోగించిన ప్ర‌ధాన ప‌దార్థం
6) ఇంటి ప‌రిస్థితి (స్థితిగ‌తులు)
7) కుటుంబ క్ర‌మ‌సంఖ్య‌
8) కుటుంబంలో సాధార‌ణంగా నివ‌సించే వ్య‌క్తుల మొత్తం సంఖ్య‌
9) కుటుంబ య‌జ‌మాని పేరు
10) కుటుంబ య‌జ‌మాని లింగం
11) కుటుంబ య‌జ‌మాని ఎస్సీ, ఎస్టీ, ఇత‌రుల‌కు చెందిన వారా (ఇది కీల‌క ప్ర‌శ్న‌)
12) ఇంటి యాజ‌మాన్య స్థితి (సొంత‌మా? అద్దెదా?)
13) కుటుంబ నివాసం కోసం అందుబాటులో ఉన్న గ‌దుల సంఖ్య‌
14) కుటుంబంలో నివ‌సిస్తున్న వివాహిత జంట‌ల సంఖ్య‌
15) తాగునీటి ప్ర‌ధాన వ‌న‌రు
16) తాగునీటి వ‌న‌రు ల‌భ్య‌త‌
17) వెలుతురు (లైటింగ్‌) కోసం ప్ర‌ధాన వ‌న‌రు
18) మ‌రుగుదొడ్డి సౌక‌ర్యం
19) రుగుదొడ్డి ర‌కం
20) మురుగునీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌
21) స్నాన‌పు గ‌ది సౌక‌ర్యం
22) వంట గ‌ది, ఎల్‌పీజీ/పీఎన్‌జీ క‌నెక్ష‌న్ ల‌భ్య‌త‌
23) వంట కోసం ఉప‌యోగించే ప్ర‌ధాన ఇంధ‌నం
24) రేడియో/ట్రాన్సిస్ట‌ర్‌
25) టెలివిజ‌న్ (టీవీ)
26) ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం
27) ల్యాప్‌ట్యాప్‌/కంప్యూట‌ర్‌
28) టెలిఫోన్‌/మొబైల్ ఫోన్/ స్మార్ట్ ఫోన్‌
29) కుటుంబం ప్ర‌ధానంగా వినియోగించే ఆహార ధాన్యాలు
30) మొబైల్ నంబ‌ర్ (కేవ‌లం గ‌ణ‌న సంబంధిత స‌మాచారం కోసం)
31) సైకిల్ లేదా స్కూట‌ర్ లేదా కారు
32) క‌రెంటు స‌దుపాయం
33) వంట‌గ‌ది సౌక‌ర్యం ఉన్న‌దా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *