Sunita Williams: సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడిపి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగిరావడంతో ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. సునీతా విలియమ్స్ విజయవంతంగా భూమికి తిరిగిరావడం సంతోషాన్నిస్తుందని అంతా సంబరం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ స్వస్థలమైన గుజరాత్ లోని ఝులసాన్ గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత బుధవారం ఆమె భూమికి సురక్షితంగా తిరిగి రావడాన్ని ప్రజలు తమ ఇంటిలో వచ్చిన విజయంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా దేవునికి హారతి ఇచ్చి ప్రార్థనలు చేశారు. క్రూ-9 సభ్యులు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి విలియమ్స్‌ను తిరిగి భూమికి తీసుకువచ్చిన డ్రాగన్ అంతరిక్ష నౌక విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత వేడుకలు ప్రారంభమయ్యాయి.
అంతకుముందు, నాసా వ్యోమగామి బంధువు దినేష్ రావల్ మంగళవారం అహ్మదాబాద్‌లో ఆమె సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థించడానికి ‘యజ్ఞం’ నిర్వహించారు. సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకున్నట్టు స్పేస్‌ఎక్స్ స్ప్లాష్‌డౌన్‌ను ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: Nara Lokesh: మండలిలో లోకేష్ ఐడియా..షాక్‌లో వైసీపీ!
“స్ప్లాష్‌డౌన్ ఆఫ్ డ్రాగన్ ధృవీకరించబడింది – నిక్, సుని, బుచ్ మరియు అలెక్స్, భూమికి తిరిగి స్వాగతం!” అంటూ Xలో ఒక పోస్ట్‌లో స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. నాసా వ్యాఖ్యాత సాండ్రా జోన్స్ ల్యాండింగ్ దృశ్యాన్ని వివరిస్తూ, “ప్రశాంతమైన, గాజు లాంటి సముద్రం పైన ఉత్కంఠభరితమైన దృశ్యాలు ఉన్నాయి” అని పేర్కొంది.
తెల్లవారుజామున 1:05 గంటలకు స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో సిబ్బంది ఎక్కి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి బయలుదేరిన తర్వాత ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో సురక్షితంగా అందరూ తిరిగి వచ్చారు. విలియమ్స్ – విల్మోర్ మిషన్ దాదాపు నిరంతర ఊహాగానాల మధ్య అంతరిక్ష యాత్ర సాగింది. విలియమ్స్ – విల్మోర్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం తీవ్రమైన ఊహాగానాలకు దారితీసింది. అయితే, ఈ వ్యోమగాములు ప్రతి ఊహాగానాన్ని ఖండిస్తూ వచ్చారు. మొత్తం మీద సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి చేరిన తరుణంలో అందరూ ఆనందోత్సాహాలతో సంబరం చేసుకుంటున్నారు.