CBSE Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న ఈ ఫలితాల్లో ఈసారి 88.39 శాతం మంది విద్యార్థులు విజయం సాధించారు. ఇది గత ఏడాది కంటే 0.41 శాతం మెరుగైన ఉత్తీర్ణతగా బోర్డు వెల్లడించింది.
విభిన్న ప్రాంతాల ఫలితాలను పరిశీలిస్తే, విజయవాడ రీజియన్ 99.60 శాతం తో అగ్రస్థానాన్ని సాధించింది. తిరువనంతపురం (99.32%), చెన్నై (97.39%), బెంగళూరు (95.95%), ఢిల్లీ వెస్ట్ (95.37%), ఢిల్లీ ఈస్ట్ (95.06%) ప్రాంతాల్లో కూడా మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. అయితే ప్రయాగ్‌రాజ్ రీజియన్‌లో మాత్రం అత్యల్పంగా 79.53 శాతం విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం.. మరో ఇద్దరిని చుట్టుముట్టిన భద్రతా సిబ్బంది
విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.in, cbseresults.nic.in వెబ్‌సైట్లలో రోల్ నంబర్, పుట్టిన తేది, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్ వంటి వివరాలు ఇచ్చి తెలుసుకోవచ్చు. అదేవిధంగా డిజీలాకర్, ఉమాంగ్ యాప్‌ల ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.
బాలికల విజయం స్పష్టంగా కనిపించింది
ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. అమ్మాయిలలో 91.64 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలలో ఈ శాతం 85.70గా నమోదైంది. ఇది గతంతో పోలిస్తే బాలికలు చదువులో ముందుండటం స్పష్టంగా సూచిస్తుంది.
42 లక్షల మంది విద్యార్థుల హాజరు
ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10వ మరియు 12వ తరగతి పరీక్షలకు 42 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అందులో 24.12 లక్షల మంది 10వ తరగతి పరీక్షలు, 17.88 లక్షల మంది 12వ తరగతి పరీక్షలు రాశారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి.
గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యకరమైన పోటీని నివారించాలనే ఉద్దేశంతో మెరిట్ జాబితాలను బోర్డు విడుదల చేయడం లేదు.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం:
-
👉 10వ తరగతి ఫలితాలపై త్వరలోనే స్పష్టత రావొచ్చని అంచనా.
