CBSE Date Sheet 2025

CBSE Date Sheet 2025: సీబీఎస్ఈ పరీక్షల తేదీల ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..

CBSE Date Sheet 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ – CBSE బుధవారం అర్థరాత్రి 10 – 12తరగతులకు  పరీక్షల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు మొదలవుతాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.

తొలిసారిగా పరీక్షకు 86 రోజుల ముందు డేట్‌షీట్‌ను విడుదల చేశారు. దీనికి ఈసారి పాఠశాలలు ఎల్‌ఓసి అంటే విద్యార్థుల లిస్ట్ ను ఇన్ టైంలో ఇవ్వడంతో ఇలా చేయగలిగారు.  ఈ సెషన్‌లో 44 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు  రాయనున్నారు. పరీక్ష ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి: IndiGo Airlines: 18 వేల అడుగుల ఎత్తులో విమానం ఇంజన్ ఫెయిల్.. తర్వాత ఏమైందంటే..

10వ తరగతి మొదటి పరీక్ష ఇంగ్లీష్‌లో ఉంటుంది. సైన్స్ పరీక్ష ఫిబ్రవరి 20న నిర్వహిస్తారు.  ఇందులో ఒక రోజు మాత్రమే సెలవు ఇవ్వబడింది. కాగా ఫిబ్రవరి 25న సోషల్ సైన్స్ పరీక్ష జరగనుంది. 10వ తరగతి విద్యార్థులకు మార్చి 18న కంప్యూటర్ అప్లికేషన్స్, ఐటీ లేదా ఏఐకి చివరి పరీక్ష ఉంటుంది.

ఇక ఫిబ్రవరి 15న 12వ తరగతి విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరీక్షఉంటుంది. ఫిజిక్స్ పరీక్ష ఫిబ్రవరి 21న, కెమిస్ట్రీ పరీక్ష ఫిబ్రవరి 27న నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ పరీక్ష మార్చి 11న, హిందీ పరీక్ష మార్చి 15న ఉంటాయి. ఏప్రిల్ 4న సైకాలజీకి చివరి పరీక్ష ఉంటుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  UGC: ఇకపై డిగ్రీ రెండేళ్లలో పూర్తి చేయవచ్చు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *