Case on YCP Nallapareddy: నెల్లూరు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం తీవ్ర దుమారం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి తన ప్రసంగంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత దాడులు చేస్తూ, తన పరువుకు భంగం కలిగించాయని ఆమె ఆరోపించారు. వెంటనే కోవూరు పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై BNS 74, 75, 79, 296 r/w 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రసన్నతో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ ఘటనతో నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మరోవైపు, ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై కూడా దాడి జరిగింది.
ఇది కూడా చదవండి: latest Telugu news: నడిరోడ్డుపై ఓ కుటుంబానికి ఘోర అవమానం! వాళ్లు ఏజెంట్లా? గూండాలా?
సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. ఫర్నీచర్, కారు ధ్వంసమయ్యాయి. అయితే దాడి జరిగినప్పుడు ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది.ఈ దాడి వెనుక టీడీపీ శ్రేణులు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల వరకు వెళ్లింది. ఇద్దరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాటల యుద్ధం మొదలై… కేసుల దాకా!
అవినీతిలో ప్రసన్న పీహెచ్‌డీ చేశారని ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ప్రసన్న తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆగ్రహంతో వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ వివాదంతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మొత్తానికి..
ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అధికార వైసీపీకి ఇది గట్టి షాక్.ఇదే వేగంతో కేసు విచారణ జరగనుంది.ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!
