Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేసింది.
ఏం జరిగింది?
2016లో పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ, రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్య కలిసి సొసైటీ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. ఈ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ నిర్బంధ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: AP News: పోలీసులపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం
హైకోర్టు తీర్పు
ఈ కేసును రద్దు చేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్ వేశారు. గత నెల (జూన్ 20)లో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా జూలై 17, గురువారం తీర్పు వెలువరించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.సంఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి ఘటనాస్థలిలో లేరు అని దర్యాప్తులో తేలిందని కోర్టు పేర్కొంది.ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవు అని స్పష్టం చేసింది. దీంతో రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.