Vettaiyan : రజినీకాంత్కు బిగ్ షాక్.. వేట్టయాన్ పై హైకోర్టులో పిటిషన్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బి అమితాబ్ నటిస్తు న్నయాక్షన్ థ్రిల్లర్ సినిమా వేట్టయాన్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 10న విడుదలకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఓ వ్యక్తి సినిమా విడుదలను ఆపాలని కోరుతూ హైకోర్టు మధురై బెంచ్ లో పిల్ దాఖలు చేశారు. సినిమా టీజర్ లో సంభాషణలు చట్టవిరుద్ధం గా ఎన్ కౌంటర్లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. “అత్యంత భయంకరమైన క్రిమినల్స్ ను ఏమాత్రం భయపడకుండా ఎన్ కౌంటర్ చేయడం వల్ల వీళ్లు హీరోలు అయ్యారు’ అంటూ కొన్ని సంభాషణలు ఉండటంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి చట్టవిరుద్ధ ఎన్ కౌంటర్లను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొన్నా విచారణ చేపట్టిన జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ వి – క్టోరియా గౌరీల ధర్మాసనం కేంద్ర సెన్సార్ బోర్డు, లైకా ప్రొడక్షనస్ కు నోటీసులు జారీ చేసింది. సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలన్న అభ్యర్ధనను తోసి పుచ్చింది.

మరోవైపు రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులకు థాంక్యూ చెబుతూ పోస్ట్‌ పెట్టారు. అంతేకాకుండా తన ఆరోగ్యంపై వాకబు చేసినందుకు ప్రధాని మోదీకి రజనీకాంత్‌ కృతజ్ఞతలు చెబుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇవాళ రజనీకాంత్‌ భార్యకు ఫోన్‌ చేసిన ప్రధాని మోదీ రజినీ ఆరోగ్యంపై ఆరా తీశారు. రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 30న అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆస్పత్రిలో వైద్యులు రజనీకాంత్‌కు స్టంట్ అమర్చారు. అయితే మూడు రోజులపాటు రజనీకాంత్‌ను వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం రజనీకాంత్ కోలుకోవడంతో వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KCR: KCR మాస్ ఎంట్రీ..ఉప్పొంగిన ఓరుగల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *