Nidhhi Agerwal Incident

Nidhhi Agerwal Incident: ‘రాజాసాబ్’ ఈవెంట్‌లో రచ్చ.. లులు మాల్ , శ్రేయస్ మీడియాపై పోలీసుల కేసు

Nidhhi Agerwal Incident: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ ప్రమోషన్స్ ఒక్కసారిగా వివాదానికి దారితీశాయి. బుధవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి లులు మాల్‌లో నిర్వహించిన రెండో సింగిల్ ‘సహన సహన’ సాంగ్ లాంచ్ ఈవెంట్ తీవ్ర గందరగోళానికి వేదికైంది. అభిమానుల అత్యుత్సాహం, నిర్వహణ లోపాలు వెరసి ఈ వేడుక ఇప్పుడు పోలీస్ కేసు వరకు వెళ్లింది.

అనుమతి లేకుండా ఈవెంట్.. పోలీసుల సీరియస్ యాక్షన్

ఈ భారీ ఈవెంట్‌కు సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోలేదని కేపీహెచ్‌బీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు లులు మాల్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులైన శ్రేయస్ మీడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వేలాది మంది అభిమానులు వచ్చే అవకాశం ఉన్నా, కనీస భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంపై సీఐ రాజశేఖర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.  పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు పోలీసుల అనుమతి తప్పనిసరి అని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హద్దులు దాటిన అభిమానం.. ఇబ్బందిపడ్డ నిధి అగర్వాల్

ఈ వేడుకలో పాల్గొన్న హీరోయిన్ నిధి అగర్వాల్‌కు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు సెల్ఫీల కోసం సోఫాల మీదకు దూసుకురావడంతో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది.

ఈవెంట్ ముగిసి తర్వాత నిధి అగర్వాల్ కారు వైపు వెళ్తుండగా, అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. కొందరు అత్యుత్సాహంతో ఆమెను తాకే ప్రయత్నం చేయడంతో నిధి తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఇది కూడా చదవండి: Chinmayi: హ‌ద్దులు దాటిన అభిమానులు.. సింగర్ చిన్మయి సీరియస్

సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోవడంతో, నిధి తన చేతులతో ముఖాన్ని అడ్డుపెట్టుకుని కారు ఎక్కిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సెలబ్రిటీల పట్ల అభిమానం ఉండాలి కానీ, అది ఒక మహిళా నటి భద్రతకు ముప్పు కలిగించేలా ఉండకూడదు. పబ్లిక్ ఈవెంట్లలో హీరోయిన్ల సేఫ్టీపై చిత్ర పరిశ్రమ పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

సంక్రాంతి బరిలో ‘రాజాసాబ్’

మారుతి దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అవ్వగా.. తాజాగా విడుదలైన ‘సహన సహన’ సాంగ్ కూడా శ్రోతలను అలరిస్తోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోంది.

ప్రమోషన్స్ పరంగా మంచి హైప్ క్రియేట్ చేయాలనుకున్న మేకర్స్‌కు, ఈ వివాదం కొంత ఇబ్బందికరంగా మారింది. రాబోయే ప్రమోషనల్ ఈవెంట్లలోనైనా భద్రతా ప్రమాణాలు పాటిస్తారో లేదో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *