Harish Rao: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. హరీష్‌రావుతోపాటు అప్పటి మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుపై చక్రధర్ కేసు పెట్టాడు. గతంలో తన ఫోన్ తప్పింగ్ చేశారు అని ఇంకా అతని పైన అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. దింతో 120(బి), 386,409, ఐటీ యాక్ట్ కింద హరీష్ రావు పైన కేసులు నమోదు చేశారు.

