Car Accident: కొత్త కారు కొన్న సంబురం.. ఔటర్ రింగ్ రోడ్డును చుట్టొద్దామన్న ఆనందం.. ముగ్గురు మిత్రుల ప్రయాణం.. క్షణాల్లో అగ్నికి ఆహుతైంది. ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మిత్రులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మే 10న అర్ధరాత్రి దాటిన తర్వాత రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
Car Accident: హైదరాబాద్ నగరంలోని బహదూర్‌ఫురా హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన రితేశ్ అగర్వాల్ ఇటీవల కొత్త కారును కొన్నారు. ఆయన కుమారుడైన దీపేశ్ అగర్వాల్ (23) తన ఫ్రెండ్స్‌తో వెళ్లొస్తానని చెప్పి ఆ కొత్తకారును తీసుకొని మే 10న రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిపోయాడు. సిటీలోని కార్వాన్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన సంచయ్ మల్పానీ (22), ప్రగతినగర్ ప్రాంతానికి చెందిన ప్రియాన్ష్ మిత్తల్ (23)తో కలిసి కారులో శంషాబాద్ ఓఆర్ఆర్ మీదుగా ఘట్‌కేసర్ వైపు బయలుదేరి వెళ్లారు.
Car Accident: అర్ధరాత్రి సమయంలో కొత్త కారు ఆనందంలో మురిసి పోతూ షికారు కొడుతుండగా, అర్ధరాత్రి 2 గంటల సమయంలో గండి చెరువు బ్రిడ్జి సమీపంలోకి వెళ్లగానే రోడ్డుపైనే ఉన్న బొలేరో వాహనాన్ని వేగంగా వెళ్తున్న కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కారులో కొద్దిగా మంటలు చెలరేగాయి.
Car Accident: ఈ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆ కారులో చిక్కుకున్న ముగ్గురినీ రక్షించే ప్రయత్నం చేశారు. మంటలు ఎగిసి పడటంతో ఆ మంటల్లోనే ముగ్గురు స్నేహితులైన దీపేశ్ అగర్వాల్, సంచయ్ మల్పానీ, ప్రియాన్ష్ మిత్తల్ సజీవ దహనమయ్యారు. వారిలో ప్రియాన్ష్ మిత్తల్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే మృతిచెందాడు.