Canada: కెనడా దేశంలోని టోరంటో నగరంలోని విమానాశ్రయంలో విమానం ల్యాండయిన తర్వాత అదుపు తప్పింది. ఈ ఘటనలో తలకిందులుగా అది బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది గాయాలైనట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ చిన్నారి సహా ముగ్గురి పరిస్థితి మిషమంగా ఉన్నట్టు వారు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Canada: కెనడా టోరంటోలోని విమాన ప్రమాదం జరిగినవెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని మిన్నె పొలిస్ నగరం నుంచి బయలుదేరి డెల్టా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ పియర్‌సన్ విమానాశ్రయ రన్‌వేపై ల్యాండవుతుండగా బోల్తా పడింది. దట్టంగా మంచు పేరుకుపోయిన రన్‌వేపై విమానం జారుతూ బోల్తా పడింది. ప్రమాద సమయంలో విమానంలో మంటలు చెలరేగాయి.
Canada: విమాన ప్రమాదం జరగ్గానే ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపు చేశారు. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో నలుగురు విమాన సిబ్బందిసహా 76 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.