Egg And Paneer: ఆరోగ్యకరమైన శరీరం కావాలంటే ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవాళ్లు ఎక్కువ ప్రొటీన్, తక్కువ కేలరీల ఆహారాన్ని ఎంచుకుంటే ఫలితాలు త్వరగా వస్తాయి. ఇక్కడ గుడ్డు, పన్నీర్ రెండూ ప్రొటీన్ హౌస్‌లుగా పేరుపొందాయి. మరి ఈ రెండింటిని ఒకేసారి తింటే బరువు తగ్గడంలో ఎంతవరకు ఉపయోగపడతాయి?
గుడ్డు లాభాలు
ఒక కోడిగుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రొటీన్, విటమిన్-ఎ, విటమిన్-డి, బి-12, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
గుడ్డు తిన్నాక కడుపు నిండినట్టు అనిపించడం వల్ల ఆకలి తగ్గి, స్నాక్స్ మానుకునే అవకాశం ఉంటుంది.
మెటబాలిజాన్ని పెంచి శరీరంలో ఫ్యాట్ బర్న్ వేగంగా జరగడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడే అన్ని ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ గుడ్లలో లభిస్తాయి.
పన్నీర్ లాభాలు
100 గ్రాముల పన్నీర్‌లో కేవలం 72 కేలరీలు, 1.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉండటంతో, ఇది వెయిట్ లాస్ డైట్ కి పర్ఫెక్ట్.
పన్నీర్లోని గుడ్ ఫ్యాట్స్ శరీరానికి తక్షణ ఎనర్జీ ఇస్తాయి. ఫలితంగా ఫ్యాట్ స్టోరేజ్ తగ్గుతుంది.
కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (CLA) పుష్కలంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడంలో, మసిల్స్ బిల్డింగ్‌లో బాగా పనిచేస్తుంది.
83 మిల్లీగ్రాముల క్యాల్షియం వంద గ్రాముల పన్నీర్‌లో ఉంటుంది. ఇది ఎముకల్ని బలంగా చేయడమే కాకుండా థర్మోజెనెసిస్ ద్వారా మెటబాలిజాన్ని బూస్ట్ చేసి ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Indiramma Canteens: రూ.5కే భోజనం.. హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం
గుడ్డు + పన్నీర్ కలిపి తింటే?
రెండింటి కలయికతో హై ప్రొటీన్, లో కేలరీ మీల్ సిద్ధమవుతుంది.
కడుపు ఎక్కువసేపు నిండినట్టు అనిపించడం వల్ల అధికంగా తినకుండా నియంత్రణ ఉంటుంది.
పొట్ట దగ్గర పేరుకున్న ఫ్యాట్ కరుగడానికి సపోర్ట్ చేస్తాయి.
విటమిన్-బి12, ఐరన్, కాల్షియం, ప్రొటీన్—all in one మీల్ లాగా పనిచేస్తాయి.
ఎలా తినాలి?
పన్నీర్ టిక్కా, స్క్రాంబుల్ పన్నీర్, పన్నీర్ 65 వంటి లైట్ వేరియేషన్స్ మాత్రమే ఎంచుకోవాలి.
పన్నీర్ బటర్ మసాలా, రిచ్ కర్రీలు మాత్రం తప్పించుకోవాలి.
గుడ్లను ఎక్కువగా బోయిల్ చేసి తింటేనే లాభం. ఫ్రై చేసిన గుడ్లను తగ్గించడం మంచిది.
