Men Ear Piercing

Men’s Ear Piercing: అబ్బాయిలు చెవులు కుట్టించుకోవచ్చా.. ఆధ్యాత్మిక రహస్యాలు!

Men’s Ear Piercing: భారతీయ సంస్కృతిలో, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాచీన నాగరికతల్లో పురుషులు చెవులు కుట్టించుకోవడం అనేది ఒక సాధారణ ఆచారంగా ఉంది. ఇది కేవలం అలంకారం లేదా ఫ్యాషన్ ట్రెండ్ మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మన దేశంలో, అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ ‘కర్ణవేద’ అని పిలువబడే ఒక ప్రత్యేక వేడుకలో చెవులు కుట్టడం జరుగుతుంది. ఇది హిందూ ధర్మంలోని పదహారు సంస్కారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కర్ణవేదం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తు శ్రేయస్సు కోసం పాటించబడుతుందని పండితులు చెబుతున్నారు.

జ్యోతిష్యం ప్రకారం గ్రహ స్థానాలు, ప్రతికూల శక్తుల నివారణ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పురుషులు చెవులు కుట్టించుకోవడం వల్ల జాతకంలోని తొమ్మిది గ్రహాల స్థానాలు బలపడతాయి. ముఖ్యంగా చెవులు కుట్టించుకోవడం వల్ల రాహువు (Rahu), కేతువుల (Ketu) ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు. రాహువు, కేతువులు ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు కలిగే అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి నుంచి ఈ ఆచారం ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు. చెవికి బంగారం లేదా రాగితో చేసిన ఆభరణాలు ధరించడం వల్ల చెడు దృష్టి, ప్రతికూల శక్తి (Negative Energy) దూరమవుతాయని విశ్వాసం. ఈ విధంగా ప్రతికూలత తగ్గినప్పుడు ఒక వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటాడని పండితులు వివరిస్తున్నారు.

Also Read: Winter Morning Walk: చలిలో పొద్దునే వాకింగ్ చేస్తున్నారా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే

శరీరంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాలలో చెవి తమ్మె (Ear Lobe) ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది నాడీ వ్యవస్థతో నేరుగా సంబంధం ఉన్న ప్రాంతం. ఈ భాగంలో చెవి కుట్టించుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది తలలో తిరిగే ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుతుంది. చెవులు కుట్టించుకున్న అబ్బాయిలు మరింత ఉత్సాహంగా, స్పష్టమైన ఆలోచనలతో ఉంటారని కొందరు విశ్వసిస్తారు. పురుషులు ఎడమ లేదా కుడి చెవులు కుట్టించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుందని, పవిత్ర శబ్దాలు, సానుకూల తరంగాలను వినగలిగే శక్తి పెరుగుతుందని, దీనివల్ల ఆత్మ శుద్ధి జరిగి పాపాలను నివారించవచ్చని ప్రశస్తి.

చెవి కుట్టించుకోవడం కేవలం జ్యోతిష్య విశ్వాసమే కాకుండా, వైద్యపరంగా కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం వివరిస్తుంది. చెవి లోబు అనేది శరీరంలోని ముఖ్యమైన ప్రెజర్ పాయింట్‌లలో ఒకటి. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరచి, శరీరంలోని శక్తి ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెవిలో రాగి లేదా బంగారం ధరించడం వల్ల శరీరంలోని విద్యుత్ ప్రవాహం (Electric Current) సమతుల్యంగా ఉంటుంది. బంగారం సూర్యుని శక్తిని సూచిస్తుంది, ఇది శక్తి ప్రవాహాన్ని సమన్వయం చేయడంలో సహాయపడుతుంది. రాగి కూడా రక్తప్రసరణను మెరుగుపరచడంలో మరియు ప్రతికూల శక్తిని దూరం చేయడంలో సహాయపడుతుందని నమ్మకం. ఈ కారణాల వల్ల, హిందూ సంస్కృతిలో ఈ కర్ణవేదనం అనే ఆచారాన్ని బాలురకు చిన్న వయసులోనే చేస్తారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *