CAG Report: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరిరోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2023-24 కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అనుమతితో ఆయన దానిని సభ ముందుంచారు. కాగ్ నివేదిక ప్రకారం.. 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు కాగా, రూ.2,19,307 కోట్లను వ్యయం చేసినట్టు వెల్లడించారు. అంటే బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం చేసినట్టుగా తేలింది.
CAG Report: 2023-24 కాగ్ నివేదిక ప్రకారం.. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతం కాగా, అంచనా కంటే అదనంగా 33 శాతాన్ని ప్రభుత్వం ఖర్చు చేసింది. వడ్డీ చెల్లింపుల కోసం 24,374 కోట్ల వ్యయం చేసింది. ఇప్పటివరకు రూ.4.03 లక్షల కోట్లుగా కాగ్ నివేదికలో నిర్దారించింది. వీటిలో వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పును రూ.2.20 లక్షల కోట్లుగా తేల్చింది.
CAG Report: వేతనాల కోసం రూ.26,981 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసినట్టు 2023-24 కాగ్ నివేదిక వెల్లడించింది. పన్ను ఆదాయం నుంచి ప్రభుత్వ ఖజానాకు 61.83 శాతం నిధులు సమకూరాయని తేల్చింది. ఆ ఏడాది కేంద్రం నుంచి వచ్చిన మొత్తం గ్రాంట్లు కేవలం రూ.9,934 కోట్లుగా పేర్కొన్నది. అదే విధంగా రెవెన్యూ రాబడుల్లో 45 శాతం వరకు వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు చేసినట్టు తెలిపింది.
CAG Report: 2023-24లో రాష్ట్ర రెవెన్యూ మిగులు రూ.779 కోట్లుగా కాగ్ నిర్దారించింది. రూ.49,997 కోట్లను రెవెన్యూ లోటుగా పేర్కొన్నది. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.33 శాతంగా తెలిపింది. ఆ ఏడాది ముగిసే వరకు రుణాల మొత్తం రూ.4,03,664 కోట్లుగా పేర్కొన్నది. జీఎస్డీపీలో 27 శాతం అప్పులకే వెళ్లినట్టు కాగ్ నివేదిక తెలిపింది.
CAG Report: 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,20,607 కోట్ల మొత్తాన్ని గ్యారెంటీలుగా ఇచ్చింది. ఆ ఏడాది తీసుకున్న రూ.50,528 కోట్లలో రూ.43,918 కోట్లను మూలధన వ్యయంపై ఖర్చు చేసింది. అదే ఏడాది స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం రూ.76,773 కోట్లను ఇచ్చింది.