CA Exams: దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది. మే 9 నుంచి మే 14 వరకు జరగాల్సిన ఇంటర్మీడియట్, ఫైనల్ పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది.
ఈ నిర్ణయం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. ప్రస్తుతం వాయిదా వేసిన పరీక్షల కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ICAI అధికారిక వెబ్‌సైట్ icai.org ను సందర్శించి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.
మునుపటి షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి 14 వరకూ సీఏ పరీక్షలు జరగాల్సి ఉండేది. ఈ మేరకు గ్రూప్ 1 ఇంటర్మీడియట్ పరీక్షలు మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. ఫైనల్ పరీక్షల్లో గ్రూప్ 1 పరీక్షలు మే 2, 4, 6 తేదీల్లో జరిగాయి. గ్రూప్ 2 పరీక్షలు మే 8, 10, 13 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే మే 9 తర్వాత ఉండాల్సిన పరీక్షలన్నీ ప్రస్తుతం వాయిదా పడ్డాయి.
Also Read: india vs pakistan: భారత్ ఎదురుదాడితో గజగజ వణికిన పాక్.. పరారీలో పాక్ ప్రధాని
CA Exams: పరీక్షలకు రెడీ అయి ఉన్న అభ్యర్థులకు ఇది కొంతవరకూ నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, భద్రతా పరమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ICAI ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటీసులను పరిశీలించాలని, తదుపరి తేదీలను పాటించాలని ICAI సూచించింది.

