C. Ilaiyaraja: సంగీత దర్శకుడుగా ఇళయరాజా ఇండియన్ సినిమాపై వేసిన ముద్ర చెరగనిది. తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఇళయరాజా మ్యూజిక్ అంటే పడి చచ్చే అభిమానులున్నారు. ఇక చిత్రపరిశ్రమలో ఆయనది సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, భారీ విజయాలు, అనుకోని పరాజయాలు. అంతే కాదు పలు వివాదాలకూ ఆయన కేంద్రబిందుగా మారారు. తాజాగా డిసెంబర్ 16న మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ సమేత శ్రీరంగమన్నార్ స్వామి దేవాలయసందర్శనకు వెళ్ళారు ఇళయరాజా.
C. Ilaiyaraja: అయితే ఆనుకోకుండా ఆలయంలోని గర్భగుడికి ఎదురుగా అర్ధమండపంలోని ప్రవేశించిన ఇళయరాజాను జీయర్ లు అడ్డుకున్నారు. వారి సూచన మేరకు గుమ్మం బయటే ఉండి పూజలు నిర్వహించారు. దీంతో ఆలయంలో ఇళయరాజాకు అవమానం జరిగిందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆలయ సిబ్బంది అర్ధమండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే పవేశం ఉంటుందని,
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్ లో మళ్లీ హింస! ఇద్దరు కూలీలను కాల్చేసిన మిలిటెంట్లు!
C. Ilaiyaraja: అదే ఆయనకు చెప్పి పంపించామని, తెలయకుండా వచ్చారు తప్ప ఆయనను తప్పు పట్టలేదని వివరణ ఇచ్చారు. ఇళయరాజా అంటే మాకు ఎంతో గౌరవమని, ఆయనకు గౌరవదర్శన జరిగిందని తెలియచేశారు. అయితే నెటిజన్స్ మాత్రం ఇసైజ్ఞాని ఇయళరాజాకు అవమానం జరిగిందంటూ భగ్గుమంటున్నారు.
SHOCKING: Ilaiyaraaja denied entry✖️ to Sanctum Sanctorum and asked to get out by the priests at Srivilliputhur Andal Temple🛕 pic.twitter.com/Aii7GQPg6k
— Manobala Vijayabalan (@ManobalaV) December 16, 2024