pushpa 2

Pushpa 2: పుష్ప 2పై షాకింగ్ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ

Pushpa 2: పుష్ప-2 మూవీ టికెట్ రేట్ పెంపుకోసం కోసం ఆంధ్రా ప్రదేశ్ లో ప్రయతిస్తున్న మూవీ టీం. అదే సమయం లో తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపుతోంది. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని డెలీట్ చేశారు. కానీ అప్పటికీ ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ తీసిన నేటిజనులు. ఇపుడు ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ ని ఉదేషిస్తు ఆ ట్వీట్ చేసింది ఎవరో కాదు నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన ఆమె మొదట బీజేపీ లో ఉండేవారు.తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో టీడీపీ లో చేరారు అయ్యారు. మొన్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: DADA: ‘పా… పా…’ గా రాబోతున్న తమిళ ‘డా… డా’!

Pushpa 2: ట్వీట్ లో ఇలా అన్నారు..  అల్లు అర్జున్ గారు మీరు నంద్యాలలో చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ మా జనాలు ఇంకా మర్చిపోలేదు. నంద్యాలలో మీరు ఎలా అయితే ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించారో అలాగే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తారని కోరుకుంటున్నాం అని ట్వీట్ లో రాశారు. నంద్యాల వెళ్లాలనే మీ సెంటిమెంట్ మాకు బాగా వర్క్ అయింది. కాబట్టి మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అయింది.ఇపుడు అదే విధంగా పుష్ప 2 సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవ్వాలి అంటూ ఆమె వ్యంగంగా ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని ఎడిట్ చేశారు. ఆ తర్వాత డిలీట్ కూడా చేశారు. ఇలా ట్వీట్ చేయడంతో ఆంధ్ర ప్రదేశ్ లో పుష్ప-2 మూవీ టికెట్ రేట్ పెంచుతారో లేదో అనేది హాట్ టాపిక్ గ మారింది.

pushpa 2

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ukku Satyagraham: ఘనంగా ఉక్కు సత్యాగ్రహం సినిమా శతదినోత్సవ వేడుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *