By elections:దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికలు గురువారం (జూన్ 19)న ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్, కేరళ, పంజాబ్‌లో ఒక్కోస్థానం చొప్పున, గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఆయా స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది.
By elections:ప్రస్తుతం జరుగుతున్న ఈ ఐదు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 23న జరుగుతుందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. పంజాబ్‌లోని లూథియానా, పశ్చిమబెంగాల్‌లోని కాళీగంజ్, గుజరాత్‌లోని కాడి, విసవడర్, కేరళలోని నీలంబూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదింటిలో మూడు స్థానాలు అధికార పార్టీలకు చెందిన సిట్టింగ్ కాగా, ఒక చోట విపక్ష ఆప్, మరో చోట స్వతంత్య్ర అభ్యర్థి ప్రాతినిథ్యం వహించారు.