Kingdom: విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత శక్తివంతమైన పాత్రతో ‘కింగ్‌డమ్’ సినిమా రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్‌లో విజయ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ సినిమా తెలుగు, కన్నడ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోగా, తమిళ రైట్స్ కూడా ఖాయమయ్యాయి. అయితే, హిందీలో థియేట్రికల్ రిలీజ్‌ను నిలిపివేసి, నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. కేరళలో రైట్స్ కోసం బేరసారాలు జరుగుతున్నాయి. విజయ్ గత చిత్రాలు ఆశించిన విజయం ఇవ్వకపోవడంతో కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని కొనేందుకు బైయర్స్ ముందుకు రావట్లేదని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ వచ్చినా, ఆశించిన ధర రాకపోతే, నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. మరి మున్ముందు ఏమవుతుందో చూడాలి.

