Bus Accident:బస్సు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్నాయి. వరుస ప్రమాదాలతో ఎందరో మృత్యువాత పడుతున్నారు. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలను మరువక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
Bus Accident:ఈ ప్రమాదంలో విశాఖపట్నం నగరం నుంచి ఒడిశాలోని జైపూర్ నగరానికి వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆంధ్రా-ఒడిశా ఘాట్ రోడ్డులో ఉదయం 7.45 గంటలకు జరిగింది. ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తతో బస్సును నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలను ఆర్పివేశారు. బస్సు ప్రమాద ఘటనపై అధికారులు విచారణకు ఆదేశాలను జారీ చేశారు.
