Bus Accident: ఇద్దరు డ్రైవర్లు సహా 48 ప్రయాణికులతో వెళ్తున్న బస్సును, ట్రక్కు ఢీకొన్న ఘోర దుర్ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగి 40 మంది బస్సులోనే సజీవదహనమయ్యారు. మెక్సికో దేశంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. బస్సులో మంటలు వ్యాపించడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
Bus Accident: మెక్సికో దేశంలోని దక్షిణ భాగంలోని టబాస్కో రాష్ట్రంలో 48 మందితో ప్రయాణిస్తున్న ఆ బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొన్నది. ఈ సమయంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు వాహనాల్లో డీజిల్ ట్యాంకులు పగిలి ఉండొచ్చని, అందుకే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. దీంతో బస్సులో ప్రయాణించే ఇద్దరు డ్రైవర్లు, 38 మంది ప్రయాణికులు ఆ మంటల్లోనే సజీవదహనమయ్యారు.
Bus Accident: వెంటనే అధికారులు, రక్షణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 30 మందికి చెందిన అవశేషాలను గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ చేపట్టినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.