Bus Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో గురువారం (మార్చి 6న) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ఆ జిల్లాలోని సోమవరప్పాడు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఇదే ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Bus Accident: వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొని రోడ్డుపైనే బొల్తా పడింది. ఈ బస్సు వెంకటరమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సు పూర్తిగా ధ్వంసమైంది. రెండు పెద్ద క్రేన్ల సాయంతో బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉన్నది.