Bus Accident: శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు ప్రయాణిస్తున్నది. ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్యదర్శనం కోసం వెళ్తున్నారు. ఇంతలో బస్సు చిన్నారుట్ల వద్దకు చేరుకున్నది. అదే సమయంలో బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. వేగంగా వస్తున్న ఆ బస్సు కొండను ఢీకొని లోయలో పడిపోతుందనుకున్నారు. ఈ లోగా అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టుకు ఆనుకొని బస్సు నిలిచిపోయింది. పెను ప్రమాదం నుంచి బయటపడింది.
Bus Accident: కర్ణాటక రాష్ట్రంలోని సిరిగుప్ప నుంచి శ్రీశైలం ఆలయ దర్శనానికి 40 మందితో కూడిన బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మందికి గాయాలయ్యాయి. కొండను ఢీకొని ఆ తర్వాత ఓ చెట్టు అడ్డు పడటంతో లోయలో పడకుండా ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగిందని డ్రైవర్ తెలిపారు.