Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్స్ ఎంపికపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటిస్తుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. అలాగే, రెండో హీరోయిన్‌గా దీపికా పదుకొనే పేరు వినిపించినప్పటికీ, ఆమె స్థానంలో ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే ఎంపికైనట్లు తాజా సమాచారం. ‘లైగర్’తో సౌత్‌లో విఫలమైన అనన్య, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పటికీ సౌత్‌లో మరో హిట్ కోసం ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్-అట్లీ లాంటి భారీ ప్రాజెక్ట్‌లో ఆమె పాత్ర ఏమిటనే ఆసక్తి నెలకొంది. అభిమానులు ఈ కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
