Flying Flea C6

Flying Flea C6: అదిరిపోయే ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి ఎలక్ట్రిక్ బైక్..!

Flying Flea C6: జీవితంలో ఏదో ఒక సమయంలో బుల్లెట్ బండి కొనాలని అనుకుంటారు ప్రతి ఒక్కరూ.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బుల్లెట్ బండ్లకు పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా మారుతూ ఎలక్ట్రిక్ బండి ‘ఫ్లయింగ్ ఫ్లీ C6’లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొని వస్తుంది. ఇందులో కూడా వినూత్నంగా ఆలోచించిన కంపెనీ వింటేజ్ బైక్‌ని ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చి మార్కెట్లోకి విడుదల చేసింది. బుల్లెట్ అంటే దాని బరువు ఇంకా సౌండ్.. కానీ పొల్యూషన్ ని దృష్టిలో ఉంచుకొని వాటిని తొలగించింది. ఈ బండి లైట్ వెయిట్ ఇంకా సైలెంట్ తో పాటు కొన్ని అదిరిపోయే ఫీచర్స్ తో యువతను ఆకర్షిస్తుంది.

ఈ బైక్ ధర రూ. 2.79 లక్షలతో మొదలు కానుంది. ఈ బైక్ ఇంకా తక్కువకి కొనుక్కోవడానికి ఇంకో ఆప్షన్ కూడా కంపెనీ ఇచ్చింది. అదే ‘బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్’ (BaaS). ఈ పద్ధతిలో తీసుకుంటే 80 వేలు తగ్గి రూ. 1.99 లక్షలకే లభిస్తుంది. ఈ బైక్ 3.91 kWh బ్యాటరీతో వస్తుంది. దీనివల్ల ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ చేస్తే సుమారు 154 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. కేవలం 65 నిమిషాలు ఛార్జ్ చేస్తే 20 నుండి 80 శాతం బ్యాటరీ ఛార్జ్ ఎక్కుతుంది.

ఫ్లయింగ్ ఫ్లీ C6 కేవలం 3.7 సెకన్లలోనే 0 నుండి 60 కి.మీ స్పీడ్ అందుకుంటుంది. గంటకు 115 కిలోమీటర్ల (kmph) గరిష్ట వేగం. ఇందులో ఫోన్ వైర్ లెస్ ఛార్జింగ్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ ఇంకా ప్రమాదాల నుండి రక్షించడానికి అడ్వాన్స్‌డ్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉన్నాయి. ఇందులో ఇంకో మంచి ఫీచర్ కూడా ఉంది.. రైడర్ స్పీడ్ మార్చుకోవడానికి ‘రైడ్ మోడ్స్’ అనే ఫీచర్ ఉంది. దీనితో రైడర్ తనకు నచ్చిన విధంగా స్పీడ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.

బైక్ బరువును గణనీయంగా తగ్గించి కేవలం 124 కిలోగ్రాములకు పరిమితం చేయడం ద్వారా, ఈ మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలోనే అత్యంత తేలికైన బైక్‌గా అవతరించింది. దీని సీటు గాలిలో తేలుతున్నట్లుగా కనిపిస్తూ, ఈ బైక్‌కు సరికొత్త లుక్‌ని ఇస్తుంది. అల్యూమినియం బాడీతో రూపొందించబడిన ఈ బైక్, చూడటానికి అత్యంత స్టైలిష్‌గా ఉంటుంది. నగర రహదారులపై సౌకర్యవంతమైన మరియు శ్రమలేని రైడింగ్ అనుభవాన్ని కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *