Hyderabad: హైదరాబాద్ నగరంలో మళ్లీ బుల్డోజర్ చప్పుళ్లు మార్మోగుతున్నాయి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో ఉన్న
పలు కట్టడాలను కూల్చివేసి హైడ్రా కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. వివిధ కారణాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఆపింది. సోమవారం నుంచి మళ్లీ అక్రమ కట్టడాల కూల్చివేతలను హైడ్రా షురూ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలోని 848 సర్వేనంబర్‌లో ఉన్న నిర్మాణాలపై కొరడా ఝులిపించింది. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంతోపాటు పరిసర జిల్లాల్లో దడ పుట్టుకొస్తున్నది. ఇటు మూసీవాసుల్లోనూ ఆందోళన నెలకొన్నది.
