Hyderabad: ముగ్గురు వచ్చారు.. కత్తితో దాడి చేశారు.. ఘర్షణ జరిగింది.. రక్తపు మడుగులో ఒకడు.. చేత్లో కత్తితో ఇంకొకడు.. ఇవన్నీ పాత కక్షలేనా.. లేక కావాలనే పొడిచారా.. అసలు ఎవరా పొడిచింది.. అసలెందుకు పొడిచారు.. పథకం ప్రకారమే వచ్చారా ముగ్గురు కత్తులు పట్టుకొని.. గట్టి స్కెచ్చే వేసారా.. చంపేయాలని ముందే ఫిక్స్ అయ్యారా..
పాత కక్షల నేపథ్యంలో స్నేహితులు తన స్నేహితుడిని హత్య చేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.సీఐజి వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ నాగోల్ గ్రామంలో నివసించే మనోజ్, తన స్నేహితుడు వంశీతో కలిసి నాగోల్ ఫ్లైఓవర్ యూ టర్న్ దగ్గర ఉన్న రాజుగారి బిర్యాని హోటల్ ముందు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న మొబైల్ సైకిల్ టిఫిన్ బండి దగ్గర టిఫిన్ చేయడానికి ఆగారు.
మనోజ్ వంశీకి చెందిన యాక్టివాపై కూర్చుని టిఫిన్ చేస్తుండగా.. వంశీ నిలబడి టిఫిన్ చేస్తున్నారు. అదే సమయంలో మనోజ్ స్నేహితులైన జైపూర్ కాలనీకి చెందిన సంజయ్, మహేష్ వల్ల స్నేహితుడు మొత్తం ముగ్గురు ఒక పల్సర్ బైక్‌పై వెనుక వైపు నుంచి వచ్చి ముగ్గురు వ్యక్తులలో సంజీవ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో యాక్టివాపై కూర్చుని టిఫిన్ చేస్తున్న మనోజ్ ను వెనకనుంచి మెడను గట్టిగా పట్టుకుని కడుపులో కత్తితో పోడిచాడు..
యాక్టివా పై నుంచి కింద పడిపోయన మనోజ్‌ను మహేష్ అనతి స్నేహితుడు పట్టుకొనగా..మనోజ్ పై సంజయ్ కూర్చుని అదే కత్తితో గొంతు కోసి చంపేశాడు. అడ్డుకోబోయిన వంశీని సంజయ్ కత్తితో పొడవగా.. వంశీ ఎడమ చేతికి కూడా రక్త గాయమైంది. మహేష్ మెడపై దాడి చేసి కొట్టాడు.
Also Read: Hyderabad: హైదరాబాద్ లో మరో కిరాతకం..కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెను చంపిన తల్లి
ఆ సమయంలో అక్కడ మరి కొంతమంది కూడా టిఫిన్ చేస్తున్నారని వంశీ మనోజ్ అన్న మధుకు ఫోన్ చేసి చెప్పగా.. మధు, వాళ్ళ అమ్మ, చెల్లెలుతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు వెళ్లి చూసేటప్పటికీ మనోజ్ గొంతు, చేతులకు, కడుపులో ఇతర భాగాలకు బలమైన రక్త గాయాలై రక్తం మడుగులో పడిపోయి చనిపోయి ఉన్నాడు.
అయితే, 2023 ఏప్రిల్ లో మనోజ్, సంజయ్‌లకి మధ్య గొడవ జరిగింది. మనోజ్ సంజయ్‌ని కత్తితో పొడవగా.. అదే విషయంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో మనోజ్‌పై కేసు నమోదైంది. కాగా, ఈ విషయంలో కొన్ని రోజుల కిందనే ఇరువురు పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడు కున్నారు. సంజయ్ మూడు లక్షల రూపాయలు తీసుకొని కాంప్రమైజ్ అయ్యారని తెలిపారు.
కానీ, సంజయ్ మాత్రం మనోజ్ తనని కత్తితో పొడిచిన విషయమును మనసులో ఉంచుకొని పథకం ప్రకారం సంజయ్ తన మిత్రులు మహేష్ మరొకతనితో కలిసి వచ్చి మనోజ్‌ను కత్తులతో పొడిచి చంపినారిన సీఐ తెలిపారు. మృతుడు మనోజ్ అన్న మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన వివరించారు.
