BRS: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌లకు బీఆర్ఎస్ పార్టీ కీలక పదవులకు అప్పగించింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సత్యవతి రాథోడ్‌ను శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా, శాసనసభలో పార్టీ విప్‌గా కేపీ వివేకానందగౌడ్‌ను నిర్ణయించినట్టు కేసీఆర్ పేర్కొన్నారు.
BRS: ఈ మేరకు శాసనమండలి, శాసనసభల్లో తమ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్, కేపీ వివేకానందగౌడ్‌లను నియమిస్తూ నిర్ణయించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు తెలిపారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు వారిని నియమకాలను ఆమోదించాల్సిందిగా కోరారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు
BRS: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులను జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులను జారీ చేసినట్టు తెలిపారు. దీంతో పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారు. నోటీసులు ఇవ్వడానికి సమయం కావాలని అసెంబ్లీ కార్యదర్శికి ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు.
