KTR: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి మన విశిష్ట సంస్కృతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇదేనని ఆయన అభివర్ణించారు.
కేటీఆర్ పేర్కొంటూ “పువ్వులను పూజించి, ప్రకృతిని ఆరాధించి, గౌరమ్మను భక్తితో కొలిచే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతిబింబం. ఇది మన అస్తిత్వానికి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది” అని అన్నారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi: చిరంజీవి-ప్రభాస్ కాంబో స్పిరిట్‌లో సంచలనం!
సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజులపాటు మహిళలు ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ, ఆటలాడుతూ జరుపుకునే సంబురమని గుర్తుచేశారు. ప్రతి ఇంటికి సిరిసంపదలు, సంతోషాలు నింపాలని, ప్రతి ఆడపడుచు జీవితంలో ఆనందం, సౌభాగ్యం నిండాలని బతుకమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.