Mahaa News: మహా న్యూస్ కథనాలకు బీఆర్ఎస్ పార్టీ భయపడింది. వాస్తవాలు జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉసుగొలిపి మహా న్యూస్ ఆఫీస్ పై చేయించారు. ఆఫీస్ లోని ఫర్నీచర్.. ఆఫీస్ ముందున్న కార్లను ధ్వంసం చేశారు బీఆర్ఎస్ రౌడీలు.. దీనికి గాను మహా న్యూస్ శాంతి నిరసనలకు పిలుపునిచ్చింది. మహా గ్రూప్ ఆఫ్ చానల్స్ చైర్మన్ సీఎండీ వంశీ శాంతి నిరసనలకు పిలుపునిచ్చారు. కార్యాలయంలోని ఉద్యోగులంతా రోడ్డుపైకి వచ్చి శాంతి నిరసనలు చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

