Malla Reddy

Malla Reddy: 3 కోట్లు ఇస్తామన్నారు.. కానీ చేయలేదు.. మల్లారెడ్డికి ఆ తెలుగు సినిమాలో విలన్ ఆఫర్!

Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో, విద్యా రంగంలో మల్లారెడ్డి గారి గురించి తెలియని వారుండరు. ఎప్పుడూ సరదాగా, ఉల్లాసంగా ఉండే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే… సందర్భం దొరికితే చాలు చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ, మాట్లాడే తీరుతో అందరినీ ఆకర్షిస్తారు. ‘పాలమ్మినా.. పూలమ్మినా’ అనే ఆయన డైలాగ్‌కు సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ ఉంది.

పాలిటిక్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, మల్లారెడ్డి గారు సినిమాలంటే, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత అభిమానమో చాలాసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, తాజాగా దసరా పండుగ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టారు.

మల్లారెడ్డికి విలన్ ఆఫర్ ఇచ్చింది ఎవరు?
“నాకు ఒక పెద్ద తెలుగు సినిమాలో విలన్ పాత్ర చేసే అవకాశం వచ్చింది. దాని కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా ఇస్తామన్నారు,” అంటూ మల్లారెడ్డి గారు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.

మల్లారెడ్డి గారికి ఈ ఆఫర్ ఇచ్చింది మరెవరో కాదు.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్!

Also Read: Uttar Pradesh: ప్రియురాలితో పట్టుబడిన భర్త రోడ్డుపై రచ్చ రచ్చ.. చూస్తూ ఉండిపోయిన పోలీసులు!

ఆ రోల్ గురించి మాట్లాడడానికి, డైరెక్టర్ హరీశ్ శంకర్ స్వయంగా తమ కాలేజీకి వచ్చి, దాదాపు గంటసేపు వేచి చూశారని మల్లారెడ్డి గారు చెప్పారు. అంతేకాకుండా, విలన్ పాత్ర కోసం ఏకంగా రూ. 3 కోట్ల పారితోషికాన్ని కూడా ఆఫర్ చేశారట!

ఆ పాత్రను ఎందుకు ఒప్పుకోలేదు?
మల్లారెడ్డి గారు ఇంత భారీ ఆఫర్‌ను తిరస్కరించడానికి కారణం ఏమిటంటే..

“విలన్‌గా చేస్తే.. ఇంటర్వెల్‌దాకా నేను హీరోను కొడతాను, ఆ తర్వాత హీరో వచ్చి నన్ను కొడతాడు, తిడతాడు. అదంతా నాకవసరం లేదు,” అంటూ నవ్వుతూ చెప్పారు మల్లారెడ్డి. ఈ సరదా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

నిజానికి, హరీశ్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమాలో విలన్ పాత్ర కోసమే హరీశ్ శంకర్.. మల్లారెడ్డి గారిని సంప్రదించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా మల్లారెడ్డే ఈ విషయాన్ని ధృవీకరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *