BRS: రైతులకు ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు జనవరి 27న నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్ వేదికగా ఈ సభ జరగనున్నది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు.
BRS: ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రకటించగా, రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో పరిమితి అనుమతితో కోర్టు నుంచి అనుమతి లభించింది. దీంతో మంగళవారం (జనవరి 27న) నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
BRS: కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉన్నది. ఈ మహాధర్నాకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు తరలివచ్చేందుకు అన్ని నియోజవకర్గాల నాయకులు ప్లాన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
BRS: ఇప్పటికే నల్లగొండలో జరిగే రైతు మహాధర్నాలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. నందినగర్‌లోని ఆయన ఇంటి నుంచి వెళ్తుండగా, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ సాగనంపాయి. కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ రైతు కండువాను కప్పి సాగనంపారు.

