Crime News

Crime News: మా చెల్లినే ప్రేమిస్తావా.. ప్రియుడి తల నరికేసి.. ముక్కలు ముక్కలు చేసిన ప్రియురాలి అన్న..

Crime News: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికులను కలచివేసింది. స్నేహితుడి చెల్లిని ప్రేమించిన పాపానికి యువకుడిని క్రూరంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు నిందితులు తలను వేరు చేసి, శరీర భాగాలను ముక్కలుగా చేసి గంగా నదిలో విసిరివేశారు.

ప్రేమ వ్యవహారం దారుణానికి దారితీసింది

కాన్పూర్‌లోని చకేరి ప్రాంతానికి చెందిన రిషికేశ్ (22) తన స్నేహితుడు పవన్ మల్లా చెల్లిని ప్రేమించాడు. ఈ వ్యవహారం పవన్‌కు కోపం తెప్పించింది. దీంతో రిషికేశ్‌ను హత్య చేయాలని కుట్ర పన్నాడు. తన స్నేహితులు బాబీ, డానీ, సత్యం, రిషు, ఆకాష్‌ల సహాయంతో ఈ నేరాన్ని అమలు చేశాడు.

29న ఇంటి నుండి బయటకు పిలిచి…

ఆగస్టు 29 సాయంత్రం రిషికేశ్‌ను మోగ్లి, నిఖిల్ అనే ఇద్దరు స్నేహితులు ఇంటి నుంచి బయటకు పిలిచారు. గణేష్ మండపానికి తీసుకెళ్తున్నామని కుటుంబానికి చెప్పి అతన్ని పవన్ బృందం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ముందే వేచి ఉన్న పవన్ గ్యాంగ్ రిషికేశ్‌ను బలవంతంగా మోటార్ సైకిల్‌పై ఎక్కించి కాన్పూర్ శివార్లలోని కాకోరి అడవికి తీసుకెళ్లింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పీపుల్ స్టార్‌‌ పవన్ కళ్యాణ్ కి.. బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు, నారా లోకేష్

తలను నరికి శరీరాన్ని ముక్కలుగా చేసి…

కాకోరి అడవిలో రిషికేశ్ చేతులు, కాళ్లు కట్టి గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు తలను వేరు చేసి, శరీరాన్ని ముక్కలుగా చేశారు. అవశేషాలను రవాణా చేయడానికి ముందుగానే సంచులను తెచ్చి, ఇ-రిక్షాలో వేసుకుని జాజ్మౌ వంతెన సమీపంలో గంగా నదిలో వేర్వేరు ప్రాంతాల్లో విసిరివేశారు.

మహారాజ్‌పూర్‌లో తల లేని మృతదేహం

రిషికేశ్‌ రెండురోజుల పాటు ఇంటికి రాకపోవడంతో అన్న రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో మహారాజ్‌పూర్ ప్రాంతంలో తల లేని మృతదేహం లభించింది. పచ్చబొట్టు, మణికట్టు దారం ఆధారంగా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రిషికేశ్‌దేనని గుర్తించారు.

ప్రధాన నిందితుడు పవన్ మల్లా పరారీలో

పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పవన్ మల్లా సహా మరో నలుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. పవన్‌కు నేర చరిత్ర ఉందని, గతంలో కాన్పూర్ జిల్లాకు 6 నెలల పాటు బహిష్కరించబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ లవ్‌అఫైర్ విషయం తెలిసి కోపంతోనే పవన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *