viral news

Viral News: పెళ్లి ఆపేసిన వధువు.. ఆమె చెప్పిన కారణం వింటే మీరు సెల్యూట్ చేయాల్సిందే

Viral News: పెళ్ళికి కొంతసమయం ముందు ఏది అడిగితే అది ఇస్తారు అని అనుకున్న పెళ్లికొడుక్కి దిమ్మ తిరిగే రీతిలో షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. తనకు 20 లక్షలు, బ్రెజ్జా కార్ కట్నంగా కావాలని, లేకుంటే ఇప్పుడే పెళ్లిమండపం నుండి వెళ్లిపోతానని పెళ్ళికొడుకు వధువు కుటుంబాన్ని బెదిరించాడు. “అలాంటివాడు నాకు వద్దు” అంటూ పెళ్లి రద్దు చేసింది పెళ్లికూతురు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

అసలు ఏం జరిగింది, పెళ్లి రద్దు చేయడానికి దారితీసిన విషయాల గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగరంలో శుక్రవారం రాత్రి వివాహం జరగాల్సి ఉంది. అప్పటివరకు అందరూ పెళ్లివేడుకలో తేలిపోతున్నారు. బంధువులు, ఫ్రెండ్స్ తో బారాత్‌లో డాన్సులు చేసుకుంటూ వరుడు రిషబ్, యుగ్వీనా లైబ్రరీ దగ్గరలో ఉన్న పెళ్లిమండపం దగ్గరికి చేరుకున్నాడు. పంతులు మంత్రాలు చదువుతున్నాడు, వచ్చిన అతిథులకు కూల్ డ్రింక్స్, మజ్జిగ అందిస్తూ క్యాటరింగ్ బాయ్స్ మండపంలో బిజీ బిజీగా తిరుగుతున్నారు. బ్యాండ్ వాళ్ళు సౌండ్ చేస్తూ పెళ్లికొడుకు కోసం వెయిట్ చేస్తున్నారు కానీ వరుడు లోపలికి రాలేదు. ఎంతకీ వరుడు రాకపోవడంతో పెళ్లిమండపం నిశ్శబ్దంగా మారిపోయింది. పంతులు మంత్రాలు ఆపేశాడు, బ్యాండ్ వాళ్ళు సౌండ్ చేయడం మానేశారు.

అక్కడ ఉన్న అందరికీ షాక్ ఇస్తూ ఒక్క విషయం చెప్పాడు పెళ్ళికొడుకు. తనకు 20 లక్షలు, బ్రెజ్జా కారు కట్నంగా కావాలని వధువు కుటుంబాన్ని అడిగాడు. “నా డిమాండ్స్ తీర్చకపోతే మీ కూతురి మెడలో తాలి కట్టకుండానే పెళ్లిమండపం నుండి వెళ్ళిపోతాను” అని బెదిరించాడు. ఆ విషయాలు విన్న పెళ్లికూతురు తండ్రి ఏం చేయాలో తెలియని స్థితికి వెళ్ళిపోయాడు. అటు ఇస్తానని చెప్పలేక, ఇటు కుటుంబ పరిస్థితిని వివరించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. పెళ్ళికొడుకును ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా అతను మాట వినే పరిస్థితిలో లేడు. ఈ విషయం తేలకపోవడంతో పెళ్లిమండపంలో గుసగుసలు మొదలయ్యాయి. చివరికి పెళ్లికూతురికి ఈ విషయం తెలిసింది.

ఇది కూడా చదవండి: Poonch LoC: పూంఛ్ సరిహద్దుల్లో పాక్ మహిళ అరెస్ట్.. తండ్రితో గొడవపడి భారత్‌లోకి చొరబాటు!

ఘటన జరుగుతున్న చోటుకి వచ్చిన వధువు నోట ఒక్కటే మాట వచ్చింది. అది విని పెళ్ళికొడుకు, పెళ్లికూతురి కుటుంబం బిత్తరపోయారు. ఆమె ఏం చెప్పిందంటే.. “పెళ్లి రద్దు చేస్తున్నాను, ఇప్పుడు తను ఒప్పుకున్నా నేను చేసుకోను” అని తేల్చి చెప్పేసింది. ఎంత ఒప్పించడానికి ప్రయత్నించినా ఆమె మాట వినలేదు. “పెళ్ళికి ముందే డబ్బుల కోసం మా కుటుంబాన్ని ఇంతలా పీడిస్తున్నాడు అంటే, పెళ్లి తర్వాత ఇంకెన్నెన్ని ఘోరాలు చేస్తాడో, నన్ను వరకట్నం కోసం ఎంత వేధిస్తాడో ఇప్పుడే కనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.

“తమ కుటుంబాన్ని అందరి ముందు డబ్బుల కోసం అవమానిస్తుంటే పెళ్ళికొడుకు కుటుంబం కూడా చూస్తుంది తప్ప ఒక్కరు కూడా ఇది తప్పు అని చెప్పలేదు. ఈ ఒక్క సంఘటన చాలు వాళ్ళు ఎలాంటివారో చెప్పడానికి. పెళ్లి తర్వాత నన్ను కొడుతున్నా, చివరికి చంపేస్తున్నా వాళ్ళు చూస్తూ ఉంటారు తప్ప ఆపడానికి కూడా రారేమో” అన్నది.

ఈ పెళ్లి రద్దు విషయం అందుకున్న వెంటనే పోలీసులు పెళ్లిమండపం దగ్గరికి చేరుకొని పెళ్ళికొడుకు రిషబ్‌తో పాటు అతని తండ్రి రామ్ అవతార్, బావమరిది సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *