Breaking news: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఉచిత పథకాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రాష్ట్రాలకు ఒకే విధానాన్ని అనుసరించాలని సూచిస్తూ, ఉచిత పథకాలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో ఉచిత పథకాలు ప్రజలకు ప్రయోజనం కలిగిస్తే, మరికొన్ని రాష్ట్రాలకు అవే ఆర్థికంగా భారం పెడుతున్నాయని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే పథకాలు అమలు చేయడం సమర్థనీయం కానీ, అవి ఆర్థిక స్థిరతకు భంగం కలిగించకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
