Breaking: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తాను తప్పకుండా పోటీ చేస్తానని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ప్రకటించారు. యాదవ సామాజిక వర్గానికి హైదరాబాద్‌లో ఎక్కడా ప్రాతినిధ్యం లేదని, ఆ వర్గం తరపున తానికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. “కాంగ్రెస్ పార్టీలో వెనుక ఏం జరుగుతుందో నాకు తెలియదు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముంది? నా కంటే సీనియర్లు పార్టీలో ఎవరూ లేరు. హైకమాండ్ నాకే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.
