Brahmanandam Emotional: తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు (జూలై 13) తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 83 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకొని చివరి దర్శనం చేశారు.
కోట పార్థివదేహానికి బ్రహ్మానందం నివాళి
కోట మృతి వార్త తెలిసిన వెంటనే ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తక్షణమే ఆయన ఇంటికి చేరుకున్నారు. కోట పార్థివ దేహాన్ని చూసి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. “అరే ఒరే” అని పిలుచుకునే అనుబంధం ఉండేదని, ఇద్దరం కలిసి రోజుకు 18 గంటలూ పని చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయని తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను ఓదార్చిన నటుడు రాజేంద్రప్రసాద్, కోట కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఇది కూడా చదవండి: Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి.. సంతాపం తెలుపుతున్న ప్రముఖులు
సినీ ప్రముఖుల నివాళులు
ప్రముఖ నటులు తానికెళ్ల భరణి, రవితేజ, రాజేంద్రప్రసాద్ సహా అనేకమంది ప్రముఖులు కోట శ్రీనివాసరావుకు గౌరవ నివాళులు అర్పించారు.తానికెళ్ల భరణి మాట్లాడుతూ.. “దశాబ్దాలుగా కోటగారితో వ్యక్తిగత పరిచయం ఉంది. ఆయన చేసిన ప్రతి పాత్రలో జీవించేవారు. అద్భుత నటన ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది” అన్నారు.హీరో రవితేజ మాట్లాడుతూ – “నాకు కోటగారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయనతో కలిసి పని చేసిన రోజులు నాకు ఎన్నటికీ మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి” అన్నారు.
కోట శ్రీనివాసరావు లేడంటే నమ్మలేకపోతున్నా.. నటన ఉన్నంతకాలం కోట ఉంటాడు.. బ్రహ్మానందం#brahmanandam #BrahmanandamEmotional #KotaSrinivasaRaoGaru #RIPKotaSrinivasaRao pic.twitter.com/b4qnQcqkvr
— s5news (@s5newsoffical) July 13, 2025
తెలుగు సినిమాకు తీరని లోటు
కోట శ్రీనివాసరావు 700కిపైగా సినిమాల్లో నటించి, విలన్ పాత్రలతో పాటు కామెడీ, క్యారెక్టర్ రోల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఆయన అద్భుతమైన డైలాగ్ డెలివరీ, మైన కంట్రోల్ ఉన్న నటన ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది.
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు కోటగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరదన్నది నిజం. టాలీవుడ్‌లో ఆయన స్థానం చిరస్థాయిగా మిగిలిపోతుంది.
