Brahma Anandha: టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ హాస్య బ్రహ్మ బ్రహ్మనందం ఇంకా ఆయన వారసుడు రాజా గౌతమ్ కలిసి వెండి తెరపై మరోసారి సందడి చేసిన విషయం తెలిసిందే. వీళ్ళు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్విఎస్ నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ చిత్రం బ్రహ్మ ఆనందం.
అయితే గ్రాండ్ ప్రమోషన్స్ ని జరుపుకున్న ఈ సినిమా డీసెంట్ బజ్ తో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా థియేటర్స్ రన్ తర్వాత ఓటిటిలో రిలీజ్ కి ఇప్పటికే రావాల్సి ఉంది.ఈ మార్చ్ 14నుంచే ఆహా లో రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకి కొత్త డేట్ ఫిక్స్ అయ్యింది.
Also Read: Good Bad Ugly: అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది!
ఆహాలో ఈ చిత్రం మార్చ్ 19 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. కామెడీ కింగ్ బ్రహ్మానందంని అపుడు థియేటర్స్ లో మిస్ అయిన అభిమానులు ఇపుడు మార్చ్ 19 న ఓటిటిలో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి శాండిల్య పీసపాటి సంగీతం అందించగా స్వధరం ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.