F1

F1: సంచలనం సృష్టిస్తున్న ఎఫ్1!

F1: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను, రేసింగ్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తున్న ‘ఎఫ్1′ హాలీవుడ్‌లో కొత్త సంచలనంగా మారింది. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో, ‘టాప్ గన్: మావెరిక్’ దర్శకుడు జోసెఫ్ కోసిన్స్కీ తెరకెక్కించిన ఈ చిత్రం ఫార్ములా 1 రేసింగ్‌ను సినిమాటిక్ అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ సినిమాలో బ్రాడ్ పిట్, రిటైర్డ్ ఎఫ్1 డ్రైవర్‌గా తిరిగి రేస్‌ట్రాక్‌పై సత్తా చాటుతాడు. పైగా ఈ సినిమాలో డామ్సన్ ఇడ్రిస్, కెర్రీ కాండన్, జావియర్ బర్డెమ్‌లతో పాటు లూయిస్ హామిల్టన్, మాక్స్ వెర్స్టాపెన్ వంటి నిజమైన ఎఫ్1 డ్రైవర్లు కనిపించడం విశేషం. నిజమైన రేస్‌లలో షూటింగ్, అత్యాధునిక కెమెరాలతో సినిమా రేసింగ్ అనుభవాన్ని థ్రిల్లింగ్‌గా మలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద $55.6 మిలియన్ల ఓపెనింగ్‌తో రికార్డ్ సృష్టించింది. ఆపిల్ ఒరిజినల్ ఫిల్మ్‌గా, త్వరలో ఆపిల్ టీవీ+లో స్ట్రీమింగ్ కానుంది. ఎఫ్1 అభిమానులకు, సినీ ప్రియులకు ఈ సినిమా ఓ విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *