Missing Case: తమిళనాడు లోని పెరంబూరుకు చెందిన 12 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 24వ తేదీ సాయంత్రం తన స్నేహితుడి ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొంటానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళింది.
ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు వీకే నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక ఉపయోగించిన మొబైల్ ఫోన్ టవర్‌ను పరిశీలించగా, బాలిక పెరంబూర్‌లోని వీనస్ మార్కెట్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ 12 ఏళ్ల బాలిక తన 16 ఏళ్ల ప్రియుడితో ఒంటరిగా ఉంది.
అదే విధంగా పెరంపూర్‌కు చెందిన మరో 14 ఏళ్ల బాలిక తన ప్రియుడు కరీముల్లా (21), విల్లివాకమ్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక అకారం ప్రాంతానికి చెందిన అభిషేక్ (19)తో కలిసి ఉంది.
ముగ్గురు జంటలు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన పోలీసులు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. సంబంధిత బాలబాలికల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు.
వైద్య పరీక్షల అనంతరం ముగ్గురు బాలికలను ముత్యాల్‌పేటలోని ప్రభుత్వ మహిళా ఆశ్రమానికి తరలించారు. అక్కడ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ల ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారు.
‘పోక్సో’ సెక్షన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడితో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. బాలుడిని గవర్నమెంట్ కేర్ హోంకు తరలించారు.
ఇది కూడా చదవండి: Dogs Banned: ఈ రాష్ట్రంలో కుక్కలు బ్యాన్.. ఈ వ్యాధి ప్రమాదం సున్నా
ఇప్పటికే కేసులు
కరీముల్లాపై 11 దొంగతనాలు, అభిషేక్‌పై ఒక దొంగతనం, 16 ఏళ్ల బాలుడిపై ఆరు చోరీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.

