Crime News: ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొమ్మని అడిగిన యువతిని ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి.. ప్రేమికుడు హత్య చేసి.. రోడ్డు పక్కన లోయలో విసిరేశాడు. ఈ ఘోర సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చికి చెందిన అల్ఫియా, పెరంబూరు జిల్లా అరుణాచల గౌండర్ నగర్‌కు చెందిన హఫీజ్ 2023 నుంచి ప్రేమించుకున్నారు.దీంతో అతన్ని పెళ్లి చేసుకునేందుకు గాను లోకనాయకి తన మతం మార్చుకొని అల్ఫియా సుల్తానగా మారింది.
అయితే ఇటీవల హఫీజ్ చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేసే కావ్య సుల్తానా అనే యువతితోనూ సన్నిహితంగా ఉన్నట్లు తెలుసుకున్న అల్ఫియా…ప్రియుడి వద్దకు వెళ్లి.. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మతం మారనని… నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసింది. ఒకవైపు కావ్యతో పాటు మరో యువతి మోనీషాను హఫీజ్ ప్రేమించాడు. తన మొదటి ప్రియురాలు అల్ఫియా తనను బెదిరిస్తోందని వారికి చెప్పిన హఫీజ్… తన ప్రియురాలు కావ్య, మోనీషాలతో కలిసి అల్ఫియాను హత్య చేసే విధంగా ఇద్దరు ప్రియురాళ్లను పురిగోల్పాడు.అనంతరం అల్ఫియాను చంపేందుకు ప్లాన్ వేసుకున్న ముగ్గురు.. ఆమెను టీ ఎస్టేట్ ప్రాంతానికి రమ్మని చెప్పాడు.
Also Read: Crime News: మొబైల్ వాడొద్దని చెప్పినందుకు తల్లిని కొట్టి చంపేశాడు!
ముందస్తు ప్లాన్ ప్రకారం ముగ్గురూ కలిసి సేలంకు వచ్చారు. పెళ్లి విషయం మాట్లాడుకుందామని చెప్పి…అద్దె కారులో అల్ఫియాను తీసుకుని ఏర్కాడుకు వెళ్లారు. మార్గమధ్యంలో కారును ఆపి…ముగ్గురు కలిసి ఖాళీ సిరంజీలతో అల్ఫియా రక్తనాళాల్లో గాలిని నింపారు. రక్తప్రసరణ ఆగిపోయి ప్రాణాలు విడిచే వరకు సిరంజితో కుచ్చారు. అనంతరం ఆమె ప్రాణాలు కోల్పోవడంతో యువతి మృతదేహాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఏర్కాడులో20 అడుగుల లోతు ఉన్న లోయలో పడవేసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ పోలీసులు వారిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
