Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని మైలాపూర్ జిల్లా, సిర్కాళి పట్టణంలో జరిగిన దారుణ ఘటనలో 16 ఏళ్ల ఒక బాలుడు, 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు కోపంతో ఆ చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ ఘటన అప్పుడే అంగన్‌వాడీ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జరిగింది. నిందితుడు ఆమెను చాక్లెట్ ఇచ్చి ఆకర్షించి, ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. చిన్నారి సహాయం కోసం కేకలు వేయగా, కోపంతో బాలుడు రాయితో ఆమె ముఖాన్ని కొట్టి తీవ్ర గాయాలు కలిగించాడు. ఈ దాడిలో చిన్నారి స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
Also Read: CBSE Board Exams: ఇకపై పదో తరగతి పరీక్షలు రెండు సార్లు
తల్లిదండ్రులు తన కుమార్తె కనిపించకపోవడంతో వెతికి, అపస్మారకంగా పడిపోయి ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ ఫిర్యాదు మేరకు, ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు 16 ఏళ్ల బాలుణ్ని అరెస్ట్ చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.