Kurnool: అమ్మా స్విమింగ్ పూల్ కు వెళ్దాం.. నేను ఈత నేర్చుకుంటా.. బడి కూడా లేదు కదమ్మా. నాన్నకు చెప్పమ్మా.. అని ఆ బాలుడు మారం చేశాడు. సరే అని అమ్మ భర్తకు చెప్పంది.. ఆ తల్లిదండ్రులు కలిసి ఇస్వీ రహదారిలో ఉన్న స్విమింగ్ పూల్‌కు వెళ్లారు. అక్కడ అనుకోకుండా జరిగిన ప్రమాదాల్లో బాలుడు క్షణాల్లో నీటి కొలనులో మృతి చెందాడు..
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న రవి, రీటా దంపతులకు ముగ్గురు మగ పిల్లలు.. రవి కోసిగిలోని ఓ పైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. పెద్ద కొడుకు ప్రిన్స్ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లామని మారాం చేశాడు. దీంతో ఆ దంపతులు ముగ్గురు చిన్నారులను తీసుకొ ని ఇస్వీ రహదారిలో ఉన్న ఈడెన్ గార్డెన్ స్వీమింగ్ పూల్ కు వెళ్లారు. అక్కడ ముందుగా కుటుంబ సభ్యులు ఫొటోలు తీసుకున్నారు.
పెద్ద కొడుకు ప్రిన్స్ తో తండ్రి స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు. క్షణాల్లో పక్కన ఉన్న ప్రిన్స్ నీటిలో తేలాడుతూ కనిపించాడు. అక్కడున్న వారంతా కేకలు వేయడంతో పరుగున వెళ్లి తండ్రి నీటిలో నుంచి కొడుకును బయటకు తీశాడు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు.
పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటివరకు తమ బిడ్డ ఆనందంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.