War 2 vs Coolie: సినిమా రంగంలో సంచలనం రేగుతోంది. ఆగస్ట్ 14న విడుదల కానున్న వార్ 2, కూలీ చిత్రాలు బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. బుక్‌మైషో డేటా ప్రకారం, వార్ 2కి 208,000 మంది ఆసక్తి చూపగా, కూలీ 162,300 లైక్‌లతో దూసుకెళ్తోంది. కానీ వార్ 2 కంటే వెనకబడే ఉంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలయికతో వార్ 2 పాన్-ఇండియా ఆకర్షణగా నిలుస్తుండగా, రజనీకాంత్ నటనతో కూలీ సౌత్‌లో హవాను చూపిస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2 స్పై యూనివర్స్‌లో భాగమైన బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌గా హైప్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు, లోకేష్ కనగరాజ్ రూపొందించిన కూలీ గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో రజనీకాంత్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. ఈ రెండు చిత్రాల హైప్‌ను బట్టి బాక్స్ ఆఫీస్ వసూళ్లలో గట్టి పోటీ ఉండనుంది. ఈ భారీ క్లాష్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!
