Botsa Satyanarayana: పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికలంటే ప్రభుత్వానికి ఎందుకు అభద్రత అనిపిస్తుందో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తన పాలనపై చంద్రబాబుకు నమ్మకం లేదనే విషయం ఈ ఎన్నికల తీరు చూపించిందని బొత్స అన్నారు. ఎంపీని అదుపులోకి తీసుకుంటూ, మంత్రిని మాత్రం విచ్చలవిడిగా తిరగనివ్వడం ఎలా న్యాయం అవుతుందని ప్రశ్నించారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తలు కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఈ ఎన్నికల ప్రక్రియ జరిగిన రోజును ‘బ్లాక్‌డే’గా గుర్తిస్తున్నామని బొత్స ప్రకటించారు. “ఒక జెడ్పీటీసీ పోయినా, వచ్చినా అంత తేడా ఏముంది? కానీ, జరిగే విధానం ప్రజాస్వామ్యానికి హాని” అని ఆయన అన్నారు.

